‘రామారావు’గా...

ABN , First Publish Date - 2021-07-13T09:24:22+05:30 IST

‘బి. రామారావు’గా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరత్‌ మండవ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే...

‘రామారావు’గా...

‘బి. రామారావు’గా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరత్‌ మండవ దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి ‘రామారావు’ టైటిల్‌ ఖరారు చేశారు. ‘ఆన్‌ డ్యూటీ’... అనేది ఉపశీర్షిక. టైటిల్‌ ప్రకటించడంతో పాటు రవితేజ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు శరత్‌ మండవ మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న థ్రిల్లర్‌ ఇది. రవితేజ, హీరోయిన్‌ దివ్యాంశా కౌశిక్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. రవితేజగారి ఫస్ట్‌లుక్‌కు వస్తున్న స్పందన సంతోషాన్ని ఇచ్చింది. ఆయన నటన, లుక్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. సినిమాలో నిజాయతీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ఎమ్మార్వోగా కనిపిస్తారని సమాచారం. ఓ హీరోయిన్‌గా దివ్యాంశా కౌశిక్‌ నటిస్తున్నారు. మరొకర్ని ఎంపిక చేయాల్సి ఉంది. నాజర్‌, సీనియర్‌ నరేశ్‌, పవిత్రా లోకేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, సురేఖా వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూరన్‌, సంగీతం: శ్యామ్‌ సీఎస్‌.


Updated Date - 2021-07-13T09:24:22+05:30 IST