విధవరాలిగా?

ABN , First Publish Date - 2021-09-22T06:22:08+05:30 IST

మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అస్తిత్వ’ చిత్రంలో టబు నటించారు. పురుష దురహంకారం, వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కింది. జాతీయ పురస్కారాల్లో...

విధవరాలిగా?

మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అస్తిత్వ’ చిత్రంలో టబు నటించారు. పురుష దురహంకారం, వివాహేతర సంబంధాల నేపథ్యంలో తెరకెక్కింది. జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ మరాఠీ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రం విడుదలై 21 సంవత్సరాలవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ టబు, మహేశ్‌ మంజ్రేకర్‌ కలిసి సినిమా చేయబోతున్నారని హిందీ చిత్రసీమ విశ్వసనీయ వర్గాల కథనం. ఓ విధవరాలి చుట్టూ తిరిగే కథతో మహేశ్‌ మంజ్రేకర్‌ ‘వైట్‌’ సినిమా ప్రకటించారు. అందులో ప్రధాన పాత్రకు టబును తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది.


Updated Date - 2021-09-22T06:22:08+05:30 IST