డబ్బులే లేవు.. డ్రగ్స్ ఎలా సాధ్యం.. NCB రిపోర్టులోని అంశాలతోనే కోర్టులో Aryan Khan తరపు లాయర్ Amit Desai వాదనలు..!

‘ఆర్యన్ ఖాన్ దగ్గర ఏమీ దొరకలేదని ఎన్సీబీ అధికారులే రిపోర్టులో రాశారు. ఆయన దగ్గర డబ్బులు కూడా లేవని కూడా చెబుతున్నారు. మరి డబ్బులు కూడా ఆయన పాకెట్‌లో లేనప్పుడు డ్రగ్స్‌ను అమ్మడం కానీ కొనడం కానీ ఎలా సాధ్యం. అక్కడకు డ్రగ్స్ తీసుకోవడానికే వెళ్లాడని ఎలా చెప్తారు..?’ అంటూ ముంబైలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో ఆర్యన్ ఖాన్ తరపు లాయర్ అమిత్ దేశాయ్ పలు పాయింట్స్‌ను లేవనెత్తారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఆయన తరపున వాదిస్తున్న అమిత్ దేశాయ్.. ఎన్సీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావిస్తూ, పంచనామాను చదువుతూ వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు.

ఛోకర్, ఇస్మీత్, అర్బాజ్ నుంచి స్వల్ప మొత్తంలో మాదకద్రవ్యాలు దొరికాయి కానీ.. ఆర్యన్ ఖాన్ నుంచి మాత్రం ఏమీ లభ్యమవలేదని లాయర్ అమిత్ దేశాయ్ గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఆర్యన్ ఖాన్ నుంచి అక్టోబర్ 3వ తారీఖునే స్టేట్‌మెంట్ తీసుకున్నారనీ, ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ను తీసుకోలేదని చెప్పుకొచ్చారు. కొన్ని టెక్నికల్ అంశాల వల్లే గతంలో మేజిస్ట్రేట్ కోర్టు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్‌ను రద్దు చేసిందనీ, అదే సమయంలో ఎన్సీబీకి కూడా కస్టడీకి ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎవరో సమాచారం ఇస్తే దాడులు చేసి ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారనీ, కానీ ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారం మాత్రం అవాస్తవమని ఎన్సీబీ అధికారులు నమోదు చేసిన పంచనామాయే సాక్ష్యం అని తేల్చిచెప్పారు. 

‘వాస్తవానికి ఆ పార్టీకి ఆర్యన్ ఖాన్‌‌ను ప్రతీక్ గబ్బా అనే వ్యక్తి ఆహ్వానించారు. ఆర్యన్‌కు ఇష్టం లేకున్నా ఆయన ఒత్తిడి మేరకు పార్టీకి వెళ్లాడు. అయితే ఎన్సీబీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఆర్యన్‌ను పార్టీకి ఆహ్వానించిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. అతడిని ప్రశ్నించనూ లేదు’ అంటూ కోర్టులో అమిత్ దేశాయ్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ ఏమీ దొరకకపోయినప్పటికీ అన్యాయంగా తన క్లయింట్‌పై అవాస్తవ, కల్పిత వాదనలతో కేసును నమోదు చేశారన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాత్రధారి అంటూ ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు ఆరోపిస్తున్నారని వాపోయారు. అయితే అసలు NDPS యాక్ట్ ప్రకారం అక్రమ రవాణా అనే పదానికి నిజమైన అర్థం మా ఎన్సీబీ సోదరులకు తప్పకుండా తెలిసే ఉంటుందని తాను భావిస్తున్నానంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

‘మారుతున్న కాలానికి అనుగుణంగా మనం చాలా చట్టాలను మార్చుకున్నాం. గతంలో మాదకద్రవ్యాలు తీసుకుంటే ఐదేళ్లు జైలు శిక్ష ఉండేది. 2001వ సంవత్సరంలో దీన్ని ఏడాదికి తగ్గించుకున్నాం. ఐక్యరాజ్య సమితి సూచనల తర్వాత చాలా దేశాల్లో గంజాయిని ప్రమాదకర డ్రగ్స్ లిస్ట్‌లోంచి తీసేశాయి. వీళ్లంతా ఎదుగుతున్న పిల్లలు. బెయిల్ ఇవ్వకుండా వీళ్లను శిక్షించొద్దు. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. జరిగిన పరిణామాలతో పాఠాలు నేర్చుకుంటారు.’ .. అంటూ అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీతో సందడి చేసిన నటి సనా ఖాన్మావాడికి ఫోర్లకంటే సిక్సర్లే ఇష్టం.. యువ ఆల్‌రౌండర్‌ వీడియోపై పంజాబ్ కింగ్స్ పోస్ట్ఈడీ విచారణకు హాజరుకానున్న పూరి జగన్నాథ్యాక్షన్ సీన్ల కోసం ఓ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటున్న Shah Rukh Khan.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.