ఓటీటీలో ఆర్య మూవీ..!

ఆర్య హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సర్పట్ట పరంపరై'. ఉత్తర చెన్నైకు చెంది బాక్సర్‌ జీవిత కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ఆర్య ఎంతో కష్టపడ్డారు. బాక్సింగ్‌ లో పూర్తి స్థాయి తర్ఫీదు పొందడంతోపాటు తన శరీరాకృతిని కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఈ స్టిల్స్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ గత చిత్రా లతో పోల్చితే ఈ చిత్రానికి ఆర్య రేయింబవళ్లు శ్రమించారని అనిపిస్తుంది. కే9 స్టూడియో అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా రెండో దశ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీని అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వెలు వడుతున్నాయి. కాగా, ఈ సినిమాలో ఆర్య సరసన తుషారా నటించగా, కలైయరసన్‌, పశుపతి, జాన్‌ విజయ్‌, కాళి వెంకట్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్బరివు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేశారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.