ఆర్య బాక్సింగ్ డ్రామా 'సర్పట్టా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ నటుడు ఆర్య నటించిన బాక్సింగ్ డ్రామా 'సర్పట్టా'. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. థియోటర్స్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన దర్శక, నిర్మాతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ రిలీజే ఉత్తమం అని ఈ నిర్ణయానికి వచ్చారట.'అట్టకత్తి', 'మద్రాస్', 'కబాలి', 'కాలా' వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు పా.రంజిత్ 'సర్పట్టా'మూవీని తెరకెక్కించారు. ఉత్తర చెన్నైకు చెంది బాక్సర్‌ జీవిత కథ ఆధారంగా కె 9 స్టూడియోస్ బ్యానర్‌పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆర్య కెరీర్‌లో వస్తున్న 30వ చిత్రం ఇది. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్‌గా, పార్థిబాన్ రాధాకృష్ణన్ - సంతోష్ ప్రతాప్ - కళైఅరసన్ - పసుపతి - భగవతి - జాన్ విజయ్ - సంజనా నటరాజన్ - తుషార ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషలలో జూలై 22వ తేదీన విడుదల కాబోతోంది.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.