హృతిక్ మాజీ భార్య సుసానేతో డేటింగ్‌పై స్పందించిన అర్స్‌లన్ గోని

సుసానే ఖాన్, హృతిక్ రోషన్ 2000లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం 2014లో విడాకులు తీసుకున్నారు. ఆ దంపతులకు హ్రీహాన్, హ్రీదాన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. సుసానే ప్రస్తుతం అర్స్‌లన్ గోని‌తో డేటింగ్ చేస్తున్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. కొన్ని రోజుల క్రితం సుసానే ఒమైక్రాన్‌కు పాజిటివ్ గా తేలింది. ఆ విషయాన్ని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌కు అర్స్‌లన్ స్పందిచారు. ‘‘ త్వరలోనే నువ్వు కోలుకుంటావు ’’ అని కామెంట్ చేశారు. 3 హార్ట్ ఎమోజీలతో పాటు, 1కిస్స్ ఎమోజీతో తన స్పందనను తెలిపారు. అర్స్‌లన్ గోని కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అతడు స్పందించారు. ‘‘ ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచవచ్చు. నేను కొంచెం స్వీట్‌గా చెప్పాలనుకున్నాను. అందుకే ఆ విధంగా స్పందించాను ’’ అని అతడు తెలిపారు.  

 

సుసానేతో డేటింగ్‌పై కూడా ఆయన మాట్లాడారు. ‘‘ నాకు  ఈ విషయం గురించి మాట్లాడాలనే ఉద్దేశం లేదు. బయట వినిపించే విషయాలను నా స్నేహితులు, బంధువులు నాకు వాట్సాప్‌లో పార్వర్డ్ చేస్తున్నారు. ఇద్దరం సంతోషకరంగా జీవిస్తున్నాం. నేను అది మాత్రమే చెప్పగలను ’’ అని అర్స్‌లన్ గోని వివరించారు.  సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టకుంటే అవకాశాలు సులభంగా రావని ఆయన చెబుతున్నారు. ‘‘ సోషల్ మీడియాలో లేకుండా అవకాశాలు దక్కించుకోవడం నేటి కాలంలో కష్టం. ఇప్పటి వరకు ఏ దర్శకుడు, నిర్మాత నన్ను నేరుగా సంప్రదించలేదు. కానీ, ఒక మేనేజర్ మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఎక్కువగా పెట్టమని సలహా ఇచ్చారు. మీరు ఎక్కువ పోస్ట్‌లు పెడితే అవకాశాలు రావొచ్చన్నారు’’ అని అర్స్‌లన్  వివరించారు.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.