జపాన్ ఆగమనం
ABN , First Publish Date - 2022-11-15T05:57:36+05:30 IST
కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మానియేల్ కథానాయిక. కార్తికి ఇది 25వ చిత్రం...

కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మానియేల్ కథానాయిక. కార్తికి ఇది 25వ చిత్రం. సోమవారం ‘జపాన్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ చాలా క్రేజీగా డిజైన్ చేశారు. ఓ సోఫాలో సేదతీరుతున్న కార్తిని చూపిస్తూ.. వెనుక ఉన్న ఫొటో ఫ్రేమ్‌లో చేతిలో గ్లోబు పట్టుకొన్న మరో కార్తిని చూపించారు. ఈ సినిమాలో కార్తి పాత్ర రెండు కోణాల్లో ఉంటుందన్న సంకేతాలు పంపారు. ఈ సినిమాతో సునీల్ తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. ‘జపాన్’లో ఆయన ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్.