హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్: కంగనాకు కోర్టు వార్నింగ్

ABN , First Publish Date - 2021-09-14T23:18:23+05:30 IST

కంగనా రనౌత్ తరపు లాయర్ కోర్టులో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోదని, ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు..

హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్: కంగనాకు కోర్టు వార్నింగ్

ముంబై: కవి, పాటల రచయిత జావెద్ అఖ్తర్ వేసిన పరువు నష్టం కేసులో కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా కాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై మెట్రోపాలిటన్ కోర్టు హెచ్చరించింది. వాస్తవానికి మంగళవారం ఆమె కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే కొవిడ్ లక్షణాలు ఉన్న కారణంగా ఆమె కోర్టు ముందు హాజరు కాలేదని ఆమె తరపున లాయర్ తెలిపారు. ఇప్పుడు పలుమార్లు కోర్టు హాజరు కాలేదని, అయితే సెప్టెంబర్ 20న తప్పనిసరిగా కోర్టు ముందు హాజరు కవాల్సిందేనని, లేదంటే ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.


కంగనా రనౌత్ తరపు లాయర్ కోర్టులో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోదని, ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. అంతే కాకుండా కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం జావెద్ తరపు లాయర్ మాట్లాడుతూ కంగనా రనౌత్‌కు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చిన ఆమె కోర్టుకు గైర్హాజరువుతూనే ఉన్నారు. కావాలనే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కంగనాకు అసలు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జ్ ఈకేసును సెప్టెంబర్ 20కు వాయిదా వేసారు.

Updated Date - 2021-09-14T23:18:23+05:30 IST