‘అర్థం’ ఫస్ట్ లుక్ వదిలిన థమన్

ABN , First Publish Date - 2021-08-17T00:53:16+05:30 IST

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్ర ఫస్ట్‌లుక్‌ని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంచలన మ్యూజిక్ దర్శకుడిగా దూసుకుపోతోన్న థమన్ విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా ఫస్ట్ లుక్ వదిలిన థమన్.. సినిమా

‘అర్థం’ ఫస్ట్ లుక్ వదిలిన థమన్

‘దేవి’, ‘పెదరాయుడు’ వంటి చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘అర్థం’. శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ తదితరులు నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్ర ఫస్ట్‌లుక్‌ని స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంచలన మ్యూజిక్ దర్శకుడిగా దూసుకుపోతోన్న థమన్ విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా ఫస్ట్ లుక్ వదిలిన థమన్.. సినిమా పెద్ద విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వ మూవీ మేకర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు. 


ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫస్ట్‌లుక్ విడుదల చేసిన థమన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిదని.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే విడుదల వివరాలు వెల్లడిస్తామని అన్నారు. దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. ‘‘కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిదని, వీఎఫ్ఎక్స్‌లో తనకు ఉన్న అనుభవంతో మరింత శ్రద్ధగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిపారు.



Updated Date - 2021-08-17T00:53:16+05:30 IST