కత్రినా పెళ్లికి Salman Khan ఫ్యామిలీ వెళుతుందంటూ వార్తలు.. అర్పితా ఖాన్ ఏమందో తెలుసా..

ABN , First Publish Date - 2021-12-02T16:51:46+05:30 IST

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తూ సినీ జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది..

కత్రినా పెళ్లికి Salman Khan ఫ్యామిలీ వెళుతుందంటూ వార్తలు.. అర్పితా ఖాన్ ఏమందో తెలుసా..

అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి వార్తలు బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తూ సినీ జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవలే వారి మ్యారేజ్‌కి వచ్చే గెస్ట్‌ల వీరేనంటూ ఓ జాబితా బయటికి వచ్చింది. అయితే ఫార్మలిటీ కోసం సల్మాన్ ఖాన్ చెల్లెలకి కూడా ఆహ్వానాన్ని పంపగా.. వారు అందరూ హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ కండల వీరుడి చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ తాజాగా స్పందించింది.


ఓ  నేషనల్ మీడియా ఈ విషయం గురించి అడగగా కొట్టిపారేసిన అర్పితాని అవన్నీ వట్టి పుకార్లని, వారికి ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పింది. దీంతో అల్వీరా కానీ, అర్పితా కానీ విక్యాట్ మ్యారేజ్‌కి వెళ్లట్లేదని, అవన్నీ అబద్ధపు ప్రచారాలని అర్థమైపోయింది.


అయితే లవ్ బ్రేకప్ తర్వాత కూడా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకరికి ఒకరు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. అంతేకాకుండా అనంతరం వారిద్దరూ కలిసి ‘టైగర్’ సిరీస్ మూవీస్ చేస్తున్నారు. కాగా, విక్కీ, కత్రినా పెళ్లి వచ్చే డిసెంబర్ 7 నుంచి 9 మధ్య రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ హోటల్ జరగనున్నట్లు సమాచారం. ఇందులో ఒక్క రాత్రికి 7 లక్షలు వెచ్చిస్తూ వరుడి కోసం రాజా మాన్‌సింగ్ సూట్‌ని, వధువు కోసం రాణి పద్మావతి సూట్ బుక్ చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-12-02T16:51:46+05:30 IST