డ్రగ్స్‌ కేసులో అర్మాన్‌ కోహ్లీ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-08-30T06:47:49+05:30 IST

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవలె అరెస్టయిన డ్రగ్స్‌ డీలర్‌ అజయ్‌ రాజ్‌ సింగ్‌ ఇచ్చిన...

డ్రగ్స్‌ కేసులో అర్మాన్‌ కోహ్లీ అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ కోహ్లీని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవలె అరెస్టయిన డ్రగ్స్‌ డీలర్‌ అజయ్‌ రాజ్‌ సింగ్‌ ఇచ్చిన సమాచారంతో అర్మాన్‌ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు సోదా చేసి, నిషేదిత మాదక ద్రవ్యం కొకైన్‌ను స్వాదీనం చేసుకొన్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. కేసు మూలాలను మరింత లోతుగా విచారించేందుకు సోమవారం దాకా తమ కస్టడీలోకి తీసుకున్నారు.


Updated Date - 2021-08-30T06:47:49+05:30 IST