మహేశ్ లేకుండా 'సర్కారు వారి పాట'..!

మహేశ్ బాబు లేకుండానే 'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతున్నట్టు తాజా సమాచారం. ఇటీవలే మహేశ్ కాలికి చిన్న సర్జరీ జరిగింది. దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్న ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడప్పుడే 'సర్కారు వారి పాట' చిత్రీకరణలో హజరయ్యే సూచనలు కనిపించకపోవడంతో చిత్రబృంద మహేశ్ లేని సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం చిత్ర షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్, జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. థమన్ సంగీత దర్శకుడు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.