'సర్కారు వారి పాట': సాంగ్స్ ఎప్పటినుంచి రిలీజ్ కాబోతున్నాయంటే..

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ సాంగ్స్ ఎప్పటినుంచి రిలీజ్ కాబోతున్నాయో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదే ఫైనల్ షెడ్యూల్ అని సమాచారం. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే, జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు ముందు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో డిసెంబర్ నుంచి 'సర్కారు వారి పాట' సాంగ్స్ వచ్చి సందడి చేసేవి. కానీ, 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ జనవరి 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టు మళ్ళీ కొత్త డేట్‌ను ప్రకటించారు. అందుకే సాంగ్స్‌ను జనవరి నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.