డ్రగ్స్‌ కేసులోకి నా పేరు లాగొద్దు

ABN , First Publish Date - 2021-09-27T05:18:20+05:30 IST

డ్రగ్స్‌ కేసులోకి నా పేరు లాగొద్దు అని బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ గబ్రియెలా సోదరుడు అజిసిలోష్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో అర్జున్‌ రాంపాల్‌కు....

డ్రగ్స్‌ కేసులోకి నా పేరు లాగొద్దు

డ్రగ్స్‌ కేసులోకి నా పేరు లాగొద్దు అని బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ గబ్రియెలా సోదరుడు అజిసిలోష్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో అర్జున్‌ రాంపాల్‌కు ఈ కేసుతో సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ‘‘ఈ విషయం తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. డ్రగ్స్‌ కేసులోకి నా పేరు లాగొద్దు. అతను నా భాగస్వామి సోదరుడు మాత్రమే. అతనితో నాకు ఏ విధమైన సంబంధం లేదు’’ అని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-09-27T05:18:20+05:30 IST