Malaika Aroraతో పెళ్లి అంటూ వార్తలు.. Arjun Kapoor రెస్పాన్స్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-19T16:22:30+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే...

Malaika Aroraతో పెళ్లి అంటూ వార్తలు.. Arjun Kapoor రెస్పాన్స్ ఇదే..

బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఈ ఏడాది నవంబర్  లేదా డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ పెళ్లికి ఆ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా అర్జున్‌ ఫన్నీ వేలో స్పందించాడు.


అర్జున్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘ఎంత ప్రేమ.. నా జీవితం గురించి నాకంటే ఇతరులు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ రాసుకొచ్చి దానికి నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశాడు. అయితే.. ఇందులో పెళ్లి గురించి డైరెక్ట్‌గా మాట్లాడలేదు. ఈ పోస్ట్ పెళ్లి గురించే చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ.. పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.



Updated Date - 2022-05-19T16:22:30+05:30 IST