బ్రేకప్ రూమర్స్‌కి చెక్ పెట్టిన మలైకా అరోరా, అర్జున్ కపూర్

ABN , First Publish Date - 2021-12-02T23:23:20+05:30 IST

మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్ తమ బంధానికి ముగింపు పలికారని

బ్రేకప్ రూమర్స్‌కి చెక్ పెట్టిన మలైకా అరోరా, అర్జున్ కపూర్

మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్ తమ బంధానికి ముగింపు పలికారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాది క్రిస్ మస్, నూతన సంవత్సర వేడుకలను వీరిద్దరూ కలిసి జరుపుకోబోరని బీ టౌన్ మీడియా తెలిపింది. కానీ, వీటన్నింటికి చెక్ పెడుతూ సోషల్ మీడియాలో వీరు ఫొటోలను షేర్ చేశారు. 


మీడియా పుకార్లకు చెక్ పెడుతూ మాల్దీవుల్లోని సాగరతీరంలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. అక్కడి బీచ్‌ల్లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మాల్దీవుల్లో ఆహారాన్ని ఆస్వాదిస్తున్న పిక్చర్స్‌ను కూడా పోస్ట్ చేశారు. ఇద్దరూ తరచుగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోరు. కానీ, బ్రేకప్ రూమర్స్ రావడంతో వాటికి సమాధానం చెప్పాలని ఈ ఫొటోలను షేర్ చేసినట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. మరి వారు పెళ్లి చేసుకోబోతున్నారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.



Updated Date - 2021-12-02T23:23:20+05:30 IST