తమిళ క్రేజీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ‘ఖైదీ(Khaidi), మాస్టర్ (Master), విక్రమ్ (Vikram)’ చిత్రాల్లో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పాత్రలు పోషించిన కుర్రాడు అర్జున్ దాస్ (Arjundas) గుర్తున్నాడు కదా. యారోగెంట్ లుక్‌తో ఆ మూడు సినిమాల్లోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అతడు.. ఇప్పడు ఏకంగా బాలీవుడ్ హీరో అయిపోతున్నాడు. మలయాళ సూపర్ హిట్ ‘అంగమాలీ డైరీస్’ (Angamali dairies) ఇప్పుడు బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. ఆల్రెడీ తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’ (Falknuma Das) గా రీమేక్ అయింది. యంగ్ టాలెంటెడ్ విశ్వక్ సేన్ (Vishwaksen) హీరోగా నటించడమే కాకుండా.. చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. మాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. అయినప్పటికీ విశ్వక్ సేన్ నటనకి, దర్శకత్వానికి మంచి పేరొచ్చింది.
రెండు వర్గాలకు చెందిన యువకులు .. కంబైన్డ్ గా మేక మాంసం వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే ఒక సంఘటన కారణంగా ఇరు వర్గాల వారు బద్ధశత్రువులవుతారు. చివరికి అది ఎక్కడికి దారి తీసింది? అన్నది మిగతా కథ. ముఖ్యంగా సింగిల్ షాట్ లో సాగే క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్. మలయాళం వెర్షన్ లోని సీన్ నే తెలుగులోనూ వాడుకున్నారు. మధుమితా సుందరరామన్ (Madhumitha Sundararaman) దర్శకత్వంలో బాలీవుడ్ ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రం తెరకెక్కబోతోంది. కెడి కురుప్పు దుర (KD Kuruppadora) నిర్మాణంలో ఈ సినిమా బాలీవుడ్ లో సెట్స్ పైకి వెళ్ళనుంది. సూర్య (Surya) నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ (Aakasham Nee Haddura) చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్నది ఆయనే. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.
2012లో కోలీవుడ్ లో ‘పెరుమాన్’ (Peumann) అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్.. ఆ తర్వాత గోపీచంద్ (Gopichand) ‘ఆక్సిజన్’ (Oxygen) తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలయింది. ఆ తర్వాత అతడు నటించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో అతడు చూపించిన టాలెంట్ కు ఫిదా అయిపోయిన లోకేశ్ కనగరాజ్.. తన మొదటి మూడు చిత్రాల్లోనూ వరుసగా ప్రత్యేకమైన పాత్రలిచ్చాడు. అంతేకాదు ఈ మూడు పాత్రలు కొకైన్‌తో లింక్ అయినవే. కమల్‌హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’ (Vikram) చిత్రం బాలీవుడ్ లో కూడా బాగా ఆడడంతో అర్జున్ దాస్.. డైరెక్ట్ గా బాలీవుడ్ కు వెళ్ళే ఛాన్స్ కొట్టేశాడు. మరి హిందీ అర్జున్ దాస్ గా అతడు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.