యాక్టింగ్ కోర్స్ చేశారా, పీటీ.ఉష కోర్స్ చేశారా అంటూ హీరోయిన్‌ను టీజ్ చేసిన Kapil Sharma

ఝమ్మంది నాదం చిత్రంలో మనోజ్ సరసన నటించి వెండితెరకు పరిచయమైన నటి తాప్సీ. అనంతరం బాలీవుడ్ లోకి అడుగు పెట్టి  పింక్, బాద్లా, నామ్ షబానా వంటి చిత్రాల్లో నటించి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆమె నటించిన ‘‘ రష్మి రాకెట్ ’’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఆ సినిమా ప్రమోషన్లల్లో పాల్గొంటుండగా ఆమెను ఓ యాంకర్ టీజ్ చేశారు.

రష్మి రాకెట్ చిత్రాన్ని సోషల్ మీడియాతో పాటు రియాలిటీ షోలలో కూడా తాప్సీ ప్రమోట్ చేస్తోంది. సినిమా ప్రమోషన్లల్లో భాగంగా ఆమె కపిల్ శర్మ షోలో సందడి చేసింది. ఈ షోలో తాప్సీని కపిల్ టీజ్ చేశారు. తను అనేక సినిమాల్లో అథ్లెట్ పాత్రను పోషించిందన్నారు. సూర్మ, Manmarziyaan సినిమాల్లో హీకీ ప్లేయర్ గా కనిపించిందన్నారు. సాండ్ ఖీ అంఖ్ సినిమాలో షూటర్ పాత్ర పోషిందన్నారు. రాబోయే రష్మి రాకెట్ మూవీలో మరల అథ్లెట్ గా కనిపించబోతుందని వివరించారు. యాక్టింగ్ కోర్స్ చేశారా లేదా పీటీ. ఉష కోర్స్ చేశారా అని టీజ్ చేశారు.

రష్మి రాకెట్ చిత్రంలో తాప్సీ స్ర్పింటర్ గా కనిపించనుంది. కచ్ బ్యాక్ డ్రాప్ లో ఈ  సినిమా నడుస్తుంది. ఆమె ఈ మూవీలో నేషనల్ లెవెల్ అథ్లెట్ గా రాణించాలనే కలలు కనే యువతి పాత్రలో నటిస్తుంది. టెస్టోస్టిరాన్ హర్మోన్ అసమతుల్యత వల్ల నేషనల్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆమెపై నిషేదం విధిస్తుంది. ఫలితంగా ఆమె న్యాయపోరాటం చేసి ఏ విధంగా గెలుపొందిందనేది చిత్ర సారాంశం. ఈ మూవీకి  అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.