Manchu Manoj, మౌనిక లు కలిసే ఉంటున్నారా?

ABN , First Publish Date - 2022-09-10T17:27:38+05:30 IST

మోహన్ బాబు (Mohan Babu) కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), స్వర్గీయ భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక (Bhuma Mounika) వార్తల్లోకి వచ్చి వైరల్ గా కూడా మారారు.

Manchu Manoj, మౌనిక లు కలిసే ఉంటున్నారా?

మోహన్ బాబు (Mohan Babu) కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj), స్వర్గీయ భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక (Bhuma Mounika) వార్తల్లోకి వచ్చి వైరల్ గా కూడా మారారు. వాళ్లిద్దరూ కలిసి బయటకి రావటంతో మనోజ్ మౌనికని పెళ్లి చేసుకుంటున్నాడు.. అనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అయితే, ఇంకో వార్త కూడా చిత్ర పరిశ్రమలో బాగా  వినపడుతోంది. అసలు మనోజ్, మౌనిక వేరు వేరుగా ఉండటం లేదు.. ఇద్దరు చాలా కాలం నుండి మనోజ్ ఇంట్లోనే వుంటున్నారని ఒక భోగట్టా. అందుకే మనోజ్ స్నేహితుడు తన గణపతి మండపానికి ఆహ్వానించినపుడు.. మనోజ్, మౌనిక ఇద్దరూ హాజరయ్యారు అని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఒక దగ్గరే కలిసి ఉండటం వల్లనే వెంటనే కలిసి రావటం సాధ్యం అని కూడా అంటున్నారు. మౌనిక కూడా తన మొదటి భర్త నుండి విడాకులు పొందింది అని కూడా చెప్తున్నారు. చాలా కధనాలు ఏంటి అంటే, ఆమె మొదటి భర్తతో విడాకుల కేసు ఇంకా కోర్ట్ లో ఉందని. 


కానీ అవి నిజం కాదట. ఆమెకి విడాకుల పత్రాలు వచ్చాయట. అందుకే ఆమె, మనోజ్ తో కలిసి అతని ఇంట్లోనే వుంది అని అంటున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో వున్నప్పుడు ఇంకా వివాహం ఎప్పుడూ.. అనే దానికి తొందర ఎందుకు అని కొందరు చెప్తున్నారు. ఇంకా ఆ తేదీ ప్రకటించటం, తరువాత అదో  పెద్ద వార్తగా రావటం ఇవన్నీ ఎందుకు, కొంచెం ప్రచారం లేకుండా సైలెంట్ గా ఉంటే మంచిది అన్నట్టుగా మనోజ్ తల్లిదండ్రులు అనుకుంటున్నట్టు తెలిసింది. మనోజ్, మౌనికల పరిచయం ఇప్పటిది కాదని, వాళ్లిద్దరూ ఒకరికొకరు ఎప్పటి నుండో తెలుసు అని అంటున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబం మొదట్లో సినిమాలు కూడా తీశారు. అప్పట్లోనే మంచు, భూమా కుటుంబాలు కలుస్తూ ఉండేవని, అప్పట్లోనే మనోజ్, మౌనికల పెళ్లి ప్రస్తావన వచ్చిందని కూడా కొందరు చెప్తున్నారు. 


అయితే అప్పుడు ఇద్దరూ వేరు వేరు కమ్యూనిటీ లకు చెందిన వారు అవటంతో రెండు కుటుంబ పెద్దలు వద్దు అనుకున్నారని కూడా తెలిసింది. తరువాత మౌనికకి వేరే వాళ్ళతో వివాహం, మనోజ్ కి ప్రణతితో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇద్దరూ మామూలుగా ఒకరితో ఒకరు టచ్ లో వున్నారు అని కూడా తెలిసింది. అటువంటి సమయంలో మనోజ్.. ప్రణతితో విడాకులు, మౌనిక.. మొదటి భర్తకి విడాకులు ఇవ్వటంతో ఈ ఇద్దరూ మళ్ళీ ఏకం అయ్యారు. మౌనిక కి మొదటి భర్త వల్ల ఒక కుమారుడు కూడా వున్నాడని తెలిసింది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఈ జంట ఒక పెద్ద టాపిక్ గా మారింది అని చెప్తున్నారు.

Updated Date - 2022-09-10T17:27:38+05:30 IST