ఆప్తులకే ఆహ్వానం

ABN , First Publish Date - 2021-12-06T06:44:44+05:30 IST

బాలీవుడ్‌ ప్రేమ జంట కట్రినా కైఫ్‌, విక్కీ కౌషల్‌ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి...

ఆప్తులకే ఆహ్వానం

బాలీవుడ్‌ ప్రేమ జంట కట్రినా కైఫ్‌, విక్కీ కౌషల్‌ త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారనే  వార్తలు గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అయితే ఈ వివాహం విషయమై ఇప్పటిదాకా కట్రీనా, విక్కీ మాత్రం పెదవి విప్పలేదు. అయితే వచ్చే వారం వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని సవాయి మాధాపూర్‌లోని రాజప్రాసాదంలో జరగనుందని సమాచారం. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో సంగీత్‌, మెహందీ, వివాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఎలాంటి హడావిడి లేకుండా ఆప్తుల సమక్షంలో ఒక్కటవనున్నారట విక్కీ, కట్రీనా. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే పెళ్లి పత్రికలు అందాయట. మొత్తం 120 మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.


Updated Date - 2021-12-06T06:44:44+05:30 IST