ద రేపిస్ట్‌కు బూసాన్‌ అవార్డ్‌

ABN , First Publish Date - 2021-10-17T06:02:21+05:30 IST

మహిళా దర్శకురాలు అపర్ణా సేన్‌ రూపొందించిన ‘ద రేపిస్ట్‌’ చిత్రం 26వ బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక కిమ్‌ జిసెక్‌ పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్‌ 7న ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఏ విండో ఆఫ్‌ ఏషియన్‌ సినిమా’...

ద రేపిస్ట్‌కు బూసాన్‌ అవార్డ్‌

మహిళా దర్శకురాలు అపర్ణా సేన్‌ రూపొందించిన ‘ద రేపిస్ట్‌’ చిత్రం 26వ బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక కిమ్‌ జిసెక్‌ పురస్కారానికి ఎంపికైంది. అక్టోబర్‌ 7న ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ఏ విండో ఆఫ్‌ ఏషియన్‌ సినిమా’ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. పలు విదేశీ చిత్రాలతో పోటీపడి ఈ సినిమా అవార్డ్‌ దక్కించుకోవడం విశేషం. అత్యాచార బాధితురాలిగా ఈ చిత్రంలో కొంకొణాసేన్‌ శర్మ అభినయం ప్రశంసలు అందుకుంది. ‘ద రేపిస్ట్‌’ చిత్రానికి అవార్డ్‌ దక్కినందుకు అపర్ణాసేన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, తన్మయ్‌ దనానియా ప్రధాన పాత్రలు పోషించారు. 


Updated Date - 2021-10-17T06:02:21+05:30 IST