కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి అపర్ణా బాలమురళి (Aparna Balamurali). 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru)గాను ఈ పురస్కారాన్ని గెలుపొందింది. అపర్ణ తాజాగా స్టార్ హీరోకు జోడీగా నటించే అవకాశం దక్కించుకుందని మాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న సినిమా ‘కాపా’(Kaapa). ఈ చిత్రంలోనే పృథ్వీరాజ్‌కు జోడీగా నటించే అవకాశాన్ని అపర్ణ దక్కించుకుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా మొదటగా మంజువారియర్ (Manju Warrier) ను అనుకున్నారు. కానీ, అజిత్ సినిమాలో నటించాల్సి ఉండటంతో ఈ ఛాన్స్‌ను ఆమె వదులుకుందని సమాచారం. అందువల్ల మంజు ప్లేస్‌లోకి అపర్ణ బాల మురళిని తీసుకున్నారని మాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ విషయాన్ని చిత్రబృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ‘కాపా’ కు షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో అసిఫ్ అలీ, ఆర్కే. రాకేష్ బోరో, అన్నా బెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరువనంతపురంలోని ఇద్దరు గ్యాంగ్స్టర్లను ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.