Lakshmi Manchu: ఏపీ సీఎం వైరల్ వీడియోకు రిప్లై ఇచ్చిన నటి.. జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా అని ప్రశ్నించిన నెటిజన్..

ABN , First Publish Date - 2022-12-02T02:44:52+05:30 IST

పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మీ మంచు (Lakshmi Manchu). హోస్ట్‌గా కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు.

Lakshmi Manchu: ఏపీ సీఎం వైరల్ వీడియోకు రిప్లై ఇచ్చిన నటి.. జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా అని ప్రశ్నించిన నెటిజన్..

పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మీ మంచు (Lakshmi Manchu). హోస్ట్‌గా కూడా అప్పుడప్పుడు మెరుస్తుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ, జగన్‌ (Jagan) ట్రోలింగ్ వీడియోకు స్పందించడంతో ఆమె వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. 


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పేరును ప్రస్తావించకుండా ఆయన నవ్వుని ఉద్దేశించి కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఆయన నవ్వులకు లోటుండదు. సమయం, సందర్భం లేకుండా నవ్వుతుంటారు’’ అని జన సేనాని చెప్పారు. జగన్ నవ్వుని హావభావాలతో చూపించారు. అప్పటి నుంచి జగన్ నవ్వుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మఖ్యమంత్రుల సమావేశంలో సీఎం జగన్ కెమెరాను చూసి నవ్విన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ‘‘పరీక్ష గదిలో ప్రశ్నపత్రాన్ని చూసిన తర్వాత నా ముఖ చిత్రం’’ అని క్యాప్షన్ ఇచ్చి నెటిజన్స్ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో తాజాగా లక్ష్మీ మంచు కంటపడింది. ఈ వీడియోకు ఆమె రిప్లై ఇచ్చారు. ‘లోల్’ అని స్పందించారు. మంచు కుటుంబానికి వైఎస్. జగన్ దగ్గరి బంధువు అవుతారు. జగన్ బంధువుల కుమార్తెనే మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వైఎస్. జగన్‌తో మంచు కుటుంబానికి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, జగన్ ట్రోలింగ్ వీడియోకు స్పందించడం వైసీపీ అభిమానులకు, సన్నిహిత బంధువులకు ఇబ్బందిగా మారింది. లక్ష్మీ మంచు పోస్ట్ కింద నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘జగన్ అన్న అనవసరంగా చేరదీశాడు మిమ్మల్ని. జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘ఇంక మీ సినిమాలు ఏపీలో రిలీజ్ చేసినట్టే.. అసలే కాలేజేస్‌కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అని పెద్దాయన వర్రీ అయిపోతున్నారు’’ అని మరో నెటిజన్ చెప్పారు.







Updated Date - 2022-12-02T02:44:52+05:30 IST