లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే అలాంటి అవకాశం వస్తుంది: అనుష్క శెట్టి

ABN , First Publish Date - 2022-01-18T00:23:36+05:30 IST

‘‘ఎన్ని పాత్రలు చేసినా.. జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్రలు కొన్నే ఉంటాయి. అలాంటి పాత్రే అరుంధతి చిత్రంలో చేసిన జేజమ్మ పాత్ర’’ అని తెలిపింది స్వీటీ అనుష్క. ‘అరుంధతి’ చిత్రం 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా

లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే అలాంటి అవకాశం వస్తుంది: అనుష్క శెట్టి

‘‘ఎన్ని పాత్రలు చేసినా.. జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్రలు కొన్నే ఉంటాయి. అలాంటి పాత్రే అరుంధతి చిత్రంలో చేసిన జేజమ్మ పాత్ర’’ అని తెలిపింది స్వీటీ అనుష్క. ‘అరుంధతి’ చిత్రం 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్‌స్టా వేదికగా ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంది అనుష్క. 16 జనవరి 2009న విడుదలైన ఈ చిత్రం.. అప్పట్లో ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇప్పటికీ ఈ చిత్రంలోని పశుపతి డైలాగ్ వైరల్ అవుతూనే ఉంటుంది. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, అలాగే జేజమ్మగా అనుష్క కనబరిచిన అభినయానికి జనాలు జేజేలు పలికారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచి అందరి మన్ననలను అందుకుంది. అటువంటి చిత్రం గురించి అనుష్క..


‘‘అరుంధతి చిత్రానికి 13 సంవత్సరాలు. ఏ నటికైనా జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే నటించగల పాత్ర అంటూ ఒకటి ఉంటుంది. జేజమ్మ పాత్ర నా జీవితంలో అటువంటిది. ఈ అవకాశం నాకు ఇచ్చిన కోడి రామకృష్ణగారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి, అరుంధతి టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. ఈ చిత్రానికి ప్రేక్షకులు అందించిన సపోర్ట్ మరిచిపోలేనిది.. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకమైనది..’’ అని తన ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో పేర్కొంది. 



Updated Date - 2022-01-18T00:23:36+05:30 IST