2023లో అనుష్కశెట్టి పెళ్లట!

ABN , First Publish Date - 2021-09-26T01:07:09+05:30 IST

దేవసేన అనుష్క టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదిహేనేళ్లు దాటింది. కథానాయిక ఆమె సక్సెస్‌రేట్‌ ఎంత వేగంగా పెరిగిందో.. ఆమె పెళ్లి గురించి గాసిప్పులు అంతే వేగంగా పెరిగాయి. పెళ్లి విషయంలో అనుష్కపై వచ్చినన్ని రూమర్స్‌ మరే హీరోయిన్‌పై రాలేదు. ప్రభాస్‌తో ఆమె వివాహం జరగనుందని ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. ‘మేమిద్దరం మంచి స్నేహితులం’ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు సర్దుమణిగాయి.

2023లో అనుష్కశెట్టి పెళ్లట!

అనుష్క పెళ్లి సినిమా వ్యక్తితో కాదు.. 

బయటి వ్యక్తితోనే!!

దేవసేన అనుష్క టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదిహేనేళ్లు దాటింది. కథానాయిక ఆమె సక్సెస్‌రేట్‌ ఎంత వేగంగా పెరిగిందో.. ఆమె పెళ్లి గురించి గాసిప్పులు అంతే వేగంగా పెరిగాయి. పెళ్లి విషయంలో అనుష్కపై వచ్చినన్ని రూమర్స్‌ మరే హీరోయిన్‌పై రాలేదు. ప్రభాస్‌తో ఆమె వివాహం జరగనుందని ఎన్నోసార్లు వార్తలొచ్చాయి. ‘మేమిద్దరం మంచి స్నేహితులం’ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలు సర్దుమణిగాయి. తదుపరి ఓ వ్యాపారవేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అది కూడా ఫేక్‌ అని తేలిపోయింది. తాజాగా స్వీటీ పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్‌ జగన్నాథ్‌ గురూజీ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 




అనుష్క వృత్తి విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటుందని, ఆమె ముఖ కవళికలను బట్టి చూేస్త ఇండస్ర్టీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని పెళ్లాడనుందని ఆయన పేర్కొన్నారు. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుష్క డౌన్‌ టూ ఎర్త్‌ అని, ఆమెలో కొంచెం కూడా అహంభావం ఉండదని తెలిపారు. 2023లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆయన జోతిష్యం ఎంతవరకూ నిజం అనేది చూడాలి. 


Updated Date - 2021-09-26T01:07:09+05:30 IST