కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన Anushka Sharma

ABN , First Publish Date - 2022-06-20T01:42:35+05:30 IST

బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నాక ఆమె చిత్రాలకు బై బై చెప్పేశారు. ‘జీరో’ అనంతరం ఆమె నుంచి ఏ సినిమా

కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన Anushka Sharma

బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నాక ఆమె చిత్రాలకు బై బై చెప్పేశారు. ‘జీరో’ అనంతరం ఆమె నుంచి ఏ సినిమా రాలేదు. దాదాపుగా నాలుగేళ్ల అనంతరం తిరిగి ఆమె వెండి‌తెర పైన మెరవనున్నారు. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ (Chakda Xpres) సినిమాలో నటించనున్నారు. ఝులన్ గోస్వామి (Jhulan Goswami) జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో ఝులన్ పాత్రలో ఆమె దర్శనమివ్వబోతున్నారు. 


అనుష్క శర్మ గత కొంతకాలంగా ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ కు సన్నద్ధం అవుతున్నారు. అందుకోసం మైదానంలో చెమటోడ్చారు. కొన్నాళ్లు క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నేను దేని కోసమైతే చెమటోడ్చానో అక్కడికి వచ్చేశాను’’ అని అనుష్క శర్మ రాశారు. ఈ పోస్ట్‌ కింద అనేక మంది సెలబ్రిటీలు కామెంట్ చేశారు. రణ్ వీర్ సింగ్, ఝులన్ గోస్వామి, రాజీవ్ మసంద్ తదితరులు స్పందించారు. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’కు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్లీన్ స్లేట్ ఫిల్మ్‌జ్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అనుష్క శర్మ జనవరి 6న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఓ మెసేజ్‌ను కూడా షేర్ చేశారు. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఝులన్ ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి చేరుకున్నారు. ఒక మహిళ స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. భారత్‌లో కొంత మంది మహిళలు మాత్రమే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారు. ఝులన్ జీవితంలోని ఎత్తు, పల్లాలను ఈ సినిమా చూపిస్తుంది. మహిళల క్రికెట్‌లో ఉన్న ఎన్నో అనుమానాలను ఆమె బ్రేక్ చేశారు. ఈ చిత్రం మహిళల క్రికెట్‌ను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఝులన్ పాత్రను పోషిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది’’ అని అనుష్క్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 



Updated Date - 2022-06-20T01:42:35+05:30 IST