ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీని అత్యంత ఘనంగా నిర్వహించుకుంది రాజమౌళి అండ్ టీమ్. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా సూపర్‌హిట్ కావడంతో చిత్ర బృందం సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతోంది. శనివారం రాత్రి జరిగిన పార్టీలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, దిల్ రాజు, ఉపాసన, ప్రణతి, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో ఓ తార మెరిసింది. చాలాకాలం తర్వాత బయటకొచ్చిందామె. ఆమె అనుష్క. స్వీటీ ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విరాయం తీసుకున్న ఆమె చాలా రోజుల తర్వాత కెమెరాకు చిక్కింది. రాజమౌళి ప్రత్యేక ఆహ్వానం మేరకు అనుష్క్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ వేడుకలో రాంచరణ్‌తో అనుష్క మాట్లాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఎం.ఎం.శ్రీవల్లి కూడా ఉన్నారు. ‘నిశ్శబ్ధం’ చిత్రం విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర కావొస్తుంది. కానీ అనుష్క కొత్త సినిమా మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలున్నాయని సమాచారం.