అనుష్క సినిమా అప్‌డేట్ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-04-02T01:38:11+05:30 IST

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా అప్‌డేట్ కోసం ఆమె అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అనుష్క నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తుందో.. లేదో అనేంతగా పరిస్థితి

అనుష్క సినిమా అప్‌డేట్ వచ్చేసింది

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా అప్‌డేట్ కోసం ఆమె అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అనుష్క నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేస్తుందో.. లేదో అనేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే ఈ మధ్య ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ మూవీ చేస్తున్నట్లుగా ప్రకటన అయితే వచ్చింది కానీ.. ఎటువంటి అప్‌డేట్ ఆ తర్వాత తెలియలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది. ఏప్రిల్ 4 నుంచి ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని యూవీ సంస్థ ప్రకటించింది.


అనుష్కతో పాటు ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌లో అనుష్కకు ఇది హ్యాట్రిక్ చిత్రం. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’.. 2018లో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ ఈ బ్యానర్‌లోనే నిర్మితమయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో.. ఇప్పుడు తెరకెక్కుతోన్న చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే అనుష్కకు ఇది 48వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి మహేష్ బాబు పి (రారా.. కృష్ణయ్య మూవీ ఫేమ్) దర్శకుడు. 

Updated Date - 2022-04-02T01:38:11+05:30 IST