RRR impact on Hollywood: ఈ మూవీ ఆస్కార్‌కి నామినేట్ అవుతుందంటున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. అంతలా..

ABN , First Publish Date - 2022-08-16T18:18:26+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించిన పీరియాడిక్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’...

RRR impact on Hollywood: ఈ మూవీ ఆస్కార్‌కి నామినేట్ అవుతుందంటున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. అంతలా..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించిన పీరియాడిక్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలలో నటించారు. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తూ.. దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. అనంతరం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ సినిమాని చూసిన పాశ్చాత్య ప్రేక్షకులు ఈ మూవీకి ఫిదా అయిపోయారు. సాధారణ జనాలతోపాటు హాలీవుడ్‌లో పేరుగాంచిన రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు. తాజాగా హాలీవుడ్‌పై ఈ సినిమా చూపించిన ప్రభావం గురించి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.


అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ పన్ను కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘దోబారా’. ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఈ  చిత్రబృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని పశ్చిమ దేశాల ప్రేక్షకులు ఎంత ఇష్టపడుతున్నారో చెప్పుకొచ్చాడు.


అనురాగ్ మాట్లాడుతూ.. ‘మనం చూసే విధంగా కాకుండా డిఫరెంట్‌గా పశ్చిమ దేశాల ప్రజలు ఆర్ఆర్ఆర్ సినిమాని చూస్తున్నారు. వారికి ఈ సినిమా చాలా నచ్చేసింది. ఒకవేళ ఈ సినిమాని భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తే మాత్రం.. 99 శాతం అకాడమీ అవార్డ్స్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అంతలా హాలీవుడ్ జనాలు ఈ సినిమాని ప్రేమిస్తున్నారు.


ఇది నా సొంత అభిప్రాయం కాదు. చాలామంది అక్కడి దేశాల్లోని ప్రేక్షకులు నాతో మాట్లాడుతూ ఈ విషయం గురించి చెప్పారు. వారు ఈ సినిమాతో రాజమౌళి అనే కొత్త టాలెంటెడ్ డైరెక్టర్‌ని కనుకున్నారు. నేను చూసే కోణంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాని పశ్చిమ దేశాల ప్రజలు అలాగే చూస్తున్నారు. మార్వెల్ మూవీస్ కంటే బెటర్ సినిమాగా ఆర్ఆర్ఆర్‌ని భావిస్తున్నారు. ఈ సినిమాలో వారికి యాక్షన్ సీక్వెన్స్‌ మాత్రమే కాదు. డ్యాన్స్ సీక్వెన్స్‌ కూడా చాలా నచ్చింది. ఆ ఎనర్జిటిక్ కొరియోగ్రఫీకి హాలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-08-16T18:18:26+05:30 IST