నా తల్లిదండ్రులు అప్పు తీసుకుని నన్ను పాఠశాలకు పంపించారు : Anurag Kashyap

ABN , First Publish Date - 2022-01-22T02:49:34+05:30 IST

కొత్త రకం కథలను వెండి తెర మీద అవిష్కరించే దర్శకుడిగా అనురాగ్ కశ్యప్‌కు పేరుంది. ‘గులాల్, బాంబే టాకీస్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ వంటి సినిమాలకు

నా తల్లిదండ్రులు అప్పు తీసుకుని నన్ను పాఠశాలకు పంపించారు : Anurag Kashyap

కొత్త రకం కథలను వెండి తెర మీద అవిష్కరించే దర్శకుడిగా అనురాగ్ కశ్యప్‌కు పేరుంది. ‘గులాల్, బాంబే టాకీస్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ వంటి సినిమాలకు అతడు దర్శకత్వం వహించాడు. అనేక బాలీవుడ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా అతడు సోషల్ మీడియాలో తన తల్లిదండ్రుల ఫొటోలను పోస్ట్ చేశాడు. తనను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు అప్పు చేశారని గుర్తు చేసుకున్నాడు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిదండ్రుల ఫొటోను అనురాగ్ కశ్యప్ ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. ఆ ఫొటో కింద కామెంట్ కూడా కాస్త ఎమోషనల్‌గానే రాశాడు. ‘‘మా అమ్మా,నాన్నకి 1970లో పెళ్లి అయింది. పెళ్లాయ్యాకే అమ్మ డిగ్రీ పూర్తి చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయానికి నేను పుట్టాను. నన్ను వాళ్లు తమ శక్తికి మించి సింధియా స్కూల్‌కి పంపించారు. వారికి చదువంటే చాలా ఇష్టం. అందుకే డబ్బులను అప్పు తీసుకుని మరీ నన్ను పాఠశాలకు పంపించారు. ఆ చదవు నన్ను ఇంతటి వాడిని చేసింది’’ అని అనురాగ్ కశ్యప్ మెసేజ్ పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్‌‌కు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలిపారు. నెటిజన్లు కూడా కామెంట్లతో తమ స్పందనను తెలుపుతున్నారు.      


అనురాగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో జన్మించాడు. రామ్ గోపాల్ మర్మ దర్శకత్వం వహించిన ‘సత్య’కు అతడు కో రైటర్ గా పనిచేశాడు. ‘దేవ్ డి’ చిత్రంతో బాలీవుడ్‌లో అతడికి మంచి విజయం లభించింది.


Updated Date - 2022-01-22T02:49:34+05:30 IST