కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran)కి టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే మహా ఇష్టం అని చెప్పింది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించిన 'అ..ఆ' చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఇందులో చేసిన నాగవల్లి పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఇక్కడ వరుసగా సినిమాలు చేసే అవకాశం అందుకుంది. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
అనుపమ ప్రస్తుతం నిఖిల్ (Nikhil) సరసన హీరోయిన్‌గా నటించిన కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రం ఈనెల 13న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకుడు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరిలో అనుపమ కూడా ఉంది. ఈ సందర్భంగా తాను కార్తికేయ 2 మూవీ గురించి, తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
"ఎంతో శ్రమించి చిత్రబృందం అంతా కార్తికేయ 2 సినిమాను తెరకెక్కించింది. ఈ మూవీలో నా పాత్రకు రిలీజ్ తరువాత మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే, మూవీ కూడా మంచి విజయం అందుకుంటుంది అని అనుపమ తెలిపింది". ఈ క్రమంలోనే మాట్లాడుతూ.. "టాలీవుడ్ లో నాకు ఎంతో ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. అటువంటి టాప్ స్టార్ తో కలిసి మూవీలో నటించే ఛాన్స్ వస్తే వెంటనే ఒకే అనేస్తాను" అని అనుపమ తెలిపింది. మరి అనుపమ మాటలు విని మెగాస్టార్ తన సినిమాలో అవకాశం కలిపిస్తారేమో చూడాలి.