అను ఇమ్మానుయేల్‌ రూటు మార్చినట్లుంది.. షూట్స్ మొదలెట్టింది

ABN , First Publish Date - 2021-11-23T03:10:36+05:30 IST

తెలుగు, తమిళం భాషల్లో రాణిస్తున్న కేరళ భామల్లో అనూ ఇమ్మానుయేల్‌ ఒకరు. ఈమె ఇప్పుడు రూటు మార్చి గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలే

అను ఇమ్మానుయేల్‌ రూటు మార్చినట్లుంది.. షూట్స్ మొదలెట్టింది

తెలుగు, తమిళం భాషల్లో రాణిస్తున్న కేరళ భామల్లో అనూ ఇమ్మానుయేల్‌ ఒకరు. ఈమె ఇప్పుడు రూటు మార్చి గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలే వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆమె లేత పసుపు రంగు దుస్తులు ధరించి ఓరకంటి చూపుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోషూట్‌ చేసి తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. వీటిని చూసిన అనూ ఫ్యాన్స్‌ వివిధ రకాలైన కామెంట్స్‌ చేస్తున్నారు. 


చివరకు ఆమె ముక్కుపుడకపై కూడా ఓ వీరాభిమాని కామెంట్‌ చేస్తూ ‘ముక్కుపుడకకే మరో ముక్కుపుడక’ అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా, కోలీవుడ్‌ హీరో విశాల్‌ నటించిన ‘తుప్పరివాలన్‌’ చిత్రం ద్వారా తమిళ వెండితెరకు పరిచయమైన అనూ ఆ తర్వాత ‘నమ్మ వీట్టు పిళ్ళై’ అనే చిత్రంలో నటించింది. అయితే, ఈమెకు ఈ రెండు చిత్రాలు సరైన బ్రేక్‌ ఇవ్వలేదు. దీంతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఈమె చేయని ప్రయత్నమంటూ లేదు. టాలీవుడ్ విషయానికి వస్తే.. మంచి అవకాశాలు వచ్చాయి కానీ.. అవేవీ ఆమెకు గుర్తింపునివ్వలేదు. అందుకేనేమో అను ఇలా ప్రయత్నాలు చేస్తుంది.  





Updated Date - 2021-11-23T03:10:36+05:30 IST