ఫోర్నోగ్రఫీ కేసులో హాట్‌బ్యూటీకి ముందస్తు బెయిల్

ABN , First Publish Date - 2022-01-19T17:34:18+05:30 IST

గతేడాది బాలీవుడ్‌ని కుదిపేసిన కేసుల్లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు ఒకటి. ఆయన నటన పేరుతో యువతులతో బలవంతంగా పోర్న్ వీడియోలు తీయించి..

ఫోర్నోగ్రఫీ కేసులో హాట్‌బ్యూటీకి ముందస్తు బెయిల్

గతేడాది బాలీవుడ్‌ని కుదిపేసిన కేసుల్లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు ఒకటి. ఆయన నటన పేరుతో యువతులతో బలవంతంగా పోర్న్ వీడియోలు తీయించి.. ఓ యాప్‌ ద్వారా ప్రమోట్ చేశాడని అరెస్టు చేయగా, రెండు నెలల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా, ఈ కేసులో ఇతనితో పాటు ప్రముఖ నటి పూనమ్ పాండే పేరు కూడా బయటికి వచ్చింది.


దీంతో తనని అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ విచారణ అనంతరం కోర్టు ఆమె అభ్యర్థనను నవంబర్ 25న తిరస్కరించింది. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ భామకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం.


ఆమె వేసిన ప్లీలో.. ‘అశ్లీల కంటెంట్ ఉండే వెబ్‌సైట్‌లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కి పిటిషనర్ యజమాని లేదా వ్యాపార భాగస్వామి కాదు. పిటిషనర్‌పై ఉన్న ఏకైక ఆరోపణ ఏమిటంటే.. ఆమె నటించినట్లు ఉన్న ఆరోపించిన కొన్ని వీడియోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అయితే అలాంటి వీడియోలు ఉన్న వెబ్‌సైట్స్‌ని ఇప్పటికే భారత ప్రభుత్వం బ్లాక్ చేసింద’ని అందులో తెలిపింది.

Updated Date - 2022-01-19T17:34:18+05:30 IST