ఒటీటీలోకి వచ్చేసిన Ante Sundaraniki

ABN , First Publish Date - 2022-07-10T14:32:44+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఒటీటీలోకి వచ్చేసిన Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). ఈ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన  క్లీన్ హిట్ చిత్రాల్లో నాని, నజ్రియా ఫహద్ (Nazriya Fahad) ల 'అంటే సుందరానికీ' కూడా ఒకటి. ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నజ్రియా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించాడు.


ఇక ఈ చిత్రం నాని కెరీర్ లో ఓ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది 'అంటే సుందరానికీ'. ప్రపంచ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో వదిలి స్ట్రీమింగ్ పై తమ రెస్పాన్స్ ని పంచుకున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. 


కాగా, నాని ప్రస్తుతం 'దసరా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. నానీ కెరీర్‌లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. తొలిసారిగా నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు.  



Updated Date - 2022-07-10T14:32:44+05:30 IST