'అంటే సుందరానికి': చిత్రీకరణ పూర్తి

ABN , First Publish Date - 2022-01-24T15:02:13+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికి' చిత్ర షూటింగ్ పూర్తైంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు చిన్న వీడియోను వదిలారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో

'అంటే సుందరానికి': చిత్రీకరణ పూర్తి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికి' చిత్ర షూటింగ్ పూర్తైంది. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు చిన్న వీడియోను వదిలారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ద్వార మళయాళ, తమిళ చిత్రాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగుతెరకు పరిచయం అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. "ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి" అని ప్రకటించిన నాని.. సెట్స్‌లో ఆఖరి రోజు తీసిన ఓ చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇక పరిస్థితులు అనుకూలిస్తే సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో వచ్చిన నాని మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు. 



Updated Date - 2022-01-24T15:02:13+05:30 IST