ఏందిరా.. భయ్ మీ లొల్లి? : అనసూయ

ABN , First Publish Date - 2022-01-27T19:19:34+05:30 IST

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. ఇన్ స్టాలో1మిలియన్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. సందర్బం వచ్చినప్పుడల్లా ఫోటోనో, వీడియోనో పోస్ట్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. నిన్న (బుధవారం) గణతంత్ర దినోత్సవ సందర్భంగా అనసూయ ఓ వీడియో పోస్ట్ చేసింది. గాంధీజీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించిన ఆమె వందేమాతరం ఆలపించింది. అయితే ఆ సమయంలో ఆమెతీరును తప్పుపడుతూ కొందరు మండిపడ్డారు. దానికి పలు కారణాలున్నాయి. వందేమాతరం ఆలపించేటప్పుడు ఆమె నిలబడకుండా కూర్చుని ఉంది.

ఏందిరా.. భయ్ మీ లొల్లి? : అనసూయ

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. ఇన్ స్టాలో1మిలియన్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. సందర్బం వచ్చినప్పుడల్లా ఫోటోనో, వీడియోనో పోస్ట్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. నిన్న (బుధవారం) గణతంత్ర దినోత్సవ సందర్భంగా అనసూయ ఓ వీడియో పోస్ట్ చేసింది. గాంధీజీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించిన ఆమె వందేమాతరం ఆలపించింది. అయితే ఆ సమయంలో ఆమెతీరును తప్పుపడుతూ కొందరు మండిపడ్డారు. దానికి పలు కారణాలున్నాయి. వందేమాతరం ఆలపించేటప్పుడు ఆమె నిలబడకుండా కూర్చుని ఉంది. వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ నిలబడి పాడొచ్చు కదా.. అని కొందరు నిలదీశారు. అంతేకాదు గాంధీజీ టీ షర్ట్ ధరించడానికి, గణతంత్ర దినోత్సవానికి అసలు సంబంధం లేదని, జవవరి 26న జరుపుకుంటున్నది స్వతంత్ర్య దినోత్సవం కాదని, గణతంత్ర దినోత్సవం అని ఆమెకు సూచించారు. 


దీంతో అనసూయ తన తప్పుతెలుసుకొని వారికి క్షమాపణ చెప్పింది. తను నిలబడి పాడనందుకు చాలా మంది అసహనానికి గురయ్యారని, తనను క్షమించాలని కోరింది. భారతదేశం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పింది. దాంతో నెటిజెన్స్ మరింతగా మండిపడ్డారు. దీంతో అనసూయ మరోసారి ఈ విమర్శలపై స్పందించింది. ‘అరేయ్.. ఏందిరా భయ్ మీ లొల్లి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీజీకి, రాజ్యాంగానికి సంబంధం ఏంటని కొందరు అడుగుతున్నారని, వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జగగణమన ఏంది? అని ప్రశ్నించింది. గాంధీజీ పోరాడితే స్వతంత్ర్యం రాబట్టే, ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం కూడా వచ్చిందని, కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకొని వాడమని కోరింది.  



Updated Date - 2022-01-27T19:19:34+05:30 IST