NTR 30 కోసం రంగంలోకి మరో రైటర్ ?

Twitter IconWatsapp IconFacebook Icon
NTR 30 కోసం రంగంలోకి మరో రైటర్ ?

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. NTR 30 గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో యన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే NTR 30 చిత్రం ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ లేటవడం.. సినిమా రిలీజై.. పరాజయం పాలవడంతో.. దానికి సంబంధించిన సమస్యలు ఇంకా కొరటాలను వీడలేదని సమాచారం. ఆ కారణంగానే  యన్టీఆర్ తో తీయబోయే సినిమా స్ర్కిప్ట్‌ను ఇంకా ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారట కొరటాల శివ. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ రైటర్ పేరును కొరటాలకు యన్టీఆర్ సూచించారట. త్వరలోనే ఆ రైటర్ కొరటాల టీమ్‌లో జాయిన్ అవుతాడని టాక్. వీలైనంత త్వరలో స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి.. చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నారు. 

NTR30 చిత్రం కోసం యన్టీఆర్ చాలా డిఫరెంట్ గా మేకవర్ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా పవర్ ఫుల్ పాత్రతో తారక్ అభిమానుల్ని అలరించబోతున్నాడు. యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ (Janatha Garrage) సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై మరింతగా హైపు క్రియేట్ అయింది. సామాజిక సమస్యల్ని కథాంశాలుగా తీసుకొని ఇప్పటి వరకూ హిట్స్ కొట్టిన కొరటాల .. ఈ సినిమాకు కూడా అదే తరహా కథాంశాన్ని ఎంచుకున్నట్టు టాక్.  మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.