తమిళ్ ఇండస్ట్రీ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రైలర్ అదుర్స్

ABN , First Publish Date - 2021-09-26T21:52:41+05:30 IST

బుల్లితెరపై యాంకర్‌గా చేసి అనంతరం హీరోగా మారి నటనతో ఆకట్టుకున్నవారు శివకార్తికేయన్. ఆయన నటించిన చిత్రాలు ఇతర భాషాల్లోకి కూడా అనువాదమయి అభిమానులను అలరిస్తుంటాయి. ఆయన నటించిన రెమో చిత్రం టాలీవుడ్‌లోకి డబ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది.

తమిళ్ ఇండస్ట్రీ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రైలర్ అదుర్స్

చెన్నై: బుల్లితెరపై యాంకర్‌గా చేసి అనంతరం హీరోగా మారి నటనతో ఆకట్టుకున్నవారు శివకార్తికేయన్. ఆయన నటించిన చిత్రాలు ఇతర భాషాల్లోకి కూడా అనువాదమయి అభిమానులను అలరిస్తుంటాయి. ఆయన నటించిన రెమో చిత్రం టాలీవుడ్‌లోకి  డబ్ అయి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఆయన తాజాగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘డాక్టర్’. ఈ మూవీకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగాఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను అక్టోబర్ 9న తీసుకురానున్నారు. 


ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. వరుసగా జరుగుతున్న మహిళల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు డాక్టర్ ఏం చేశాడు? ఆ మహిళల కిడ్నాప్‌లను డాక్టర్ అడ్డుకున్నాడా? ఆ ముఠా ఆటకట్టించడా అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రయాంక అరుళ్ మోహన్, యోగిబాబు, అర్చన కీలక పాత్రల్లో నటించారు. కేజేఆర్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Updated Date - 2021-09-26T21:52:41+05:30 IST