Yashoda : సమంత నుంచి మరో సర్‌ప్రైజ్ ?

Twitter IconWatsapp IconFacebook Icon
Yashoda : సమంత నుంచి మరో సర్‌ప్రైజ్ ?

దక్షిణాదిన టాలెంటెడ్ బ్యూటీగానూ, అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగానూ సమంత (Samantha) దూసుకుపోతోంది. ప్రస్తుతం సామ్.. పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. వాటిలో మహిళా ప్రాధాన్యమున్న చిత్రం ‘యశోద’ (Yashoda) ఒకటి. హరి - హరీశ్ (Hari - Harish) దర్శక ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కాబోతోంది. మలయాళ యంగ్ హీరో ఉన్నిముకుందన్ (Unni Mukundan) కీలక పాత్ర పోషిస్తుండగా.. మురళీశర్మ, రావురమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేశ్, దివ్యా శ్రీపాద, ప్రియాంకా శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో సమంతపై ఓ ప్రత్యేక గీతం చిత్రీకరించబోతున్నారట. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పుష్ప’ (Pushpa) చిత్రం కోసం సమంత తొలిసారిగా నర్తించిన ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా’ పాటను మించి మరింత స్పైసీగా ఆ పాట ఉంటుందని టాక్. సమంత ఈ సినిమాలో అభిమానులు ఆశ్చర్యపోయే స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొందని, ఆమె యాక్షన్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుందట సమంత. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘యశోద’ తెరకెక్కుతోంది. 

ఇంతకు ముందు విడుదలైన ‘యశోద’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సామ్ కేరక్టర్ రెండు షేడ్స్‌లో ఉంటుందని, అది సినిమాకే హైలైట్ అని ఇదివరకు వార్తలొచ్చాయి. దీనికన్నా ముందు సమంత నటించిన గుణశేఖర్ (Gunasekhar) ‘శాకుంతలం’ (Shaakunthalam) పౌరాణిక చిత్రం ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల కావడానికి మరింత టైమ్ పట్టవచ్చు. అందుకే దాన్ని కన్నా ముందుగా.. ‘యశోద’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరి ‘యశోద’ గా సామ్ ఏ స్థాయిలో అభిమానుల్ని మెప్పిస్తుందో చూడాలి. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.