‘పుష్ప’కు మరో షాక్..!

ABN , First Publish Date - 2021-08-17T21:38:24+05:30 IST

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే ఓ సాంగ్, ఓ ఫైట్‌లో కొన్ని సెకండ్లు లీక్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

‘పుష్ప’కు మరో షాక్..!

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదలకు సన్నద్ధమవుతుంది.  వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేయాల‌ని భావిస్తున్న బ‌న్నీ, ద‌ర్శక‌, నిర్మాత‌ల‌కు లీకుల స‌మ‌స్య పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది.


అదేదో కనుగొనే లోపే ఓ ఫైట్ సీక్వెన్స్‌లో కొన్ని సెక‌న్స్‌ను లీకేజీ వీరులు లీక్ చేశారు. ఇదేంట్రా బాబు ఇలాగ‌వుతుందని ఆలోచించే లోపు ‘వ‌ల్లీ వ‌ల్లీ..’ అంటూ బ‌న్నీ, ర‌ష్మిక‌పై సాగే మ‌రో సాంగ్‌లో కొన్ని సెక‌న్స్ లీకైన‌ట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప యూనిట్ వి.ఎఫ్.ఎక్స్ కోసం ఓ న‌ల‌బై ఐదు నిమిషాల ఫుటేజ్‌ను ఓ సంస్థ‌కు అప్ప‌గించింది. అక్క‌డ నుంచే ఇది లీకైంద‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. ఇప్ప‌టికే సైబ‌ర్ పోలీసుల‌కు వారు ఫిర్యాదు కూడా చేశారు. మ‌రి స‌ద‌రు వి.ఎఫ్‌.ఎక్స్ సంస్థ నుంచి మొత్తం ఫుటేజ్ లీకైందేమోన‌ని నిర్మాత‌లు టెన్ష‌న్‌ప‌డుతున్న‌ట్లు టాక్‌. 

Updated Date - 2021-08-17T21:38:24+05:30 IST