Aryan Khan కేసుతోపాటు బాలీవుడ్‌లో మరో సంచలనం.. ఎన్సీబీ తర్వాతి టార్గెట్ ఆయనేనా..

ABN , First Publish Date - 2021-10-21T22:27:32+05:30 IST

Aryan Khan కేసుతోపాటు బాలీవుడ్‌లో మరో సంచలనం.. ఎన్సీబీ తర్వాతి టార్గెట్ ఆయనేనా..

Aryan Khan కేసుతోపాటు బాలీవుడ్‌లో మరో సంచలనం.. ఎన్సీబీ తర్వాతి టార్గెట్ ఆయనేనా..

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)అధికారులకు లక్ష్యంగా మారనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎన్సీబీ దర్యాప్తు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ పార్టీలో పాల్గొన్న అందరిపై ఎన్సీబీ నిఘా ఉంచినట్టు సమాచారం. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలను అరెస్టు చేసిన ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే పదవిని మరో ఆరు నెలలు కేంద్రప్రభుత్వం పొడిగించడం గమనార్హం.


గత 6నెలలుగా అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలపై ఎన్సీబీ అధికారులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది.  కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీ పై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి చెప్పారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలెబ్రిటీలయిన రణ్ బీర్ కపూర్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అయాన్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు.


ఆ వీడియోను కరణ్ జోహార్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పంచుకున్నారు. ఆ పార్టీలో బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణాలున్నాయి. ఎటువంటి సాక్ష్యాలు ఆ వీడియోలో లభించలేదని అధికారులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడగానే ఎన్సీబీ అధికారులు ఆ వీడియోపై దర్యాప్తు జరపడం  మొదలుపెట్టారు.


తనకు పొడిగించిన 6 నెలల పదవి కాలంలో ఏ బాలీవుడ్ సెలెబ్రిటీని సమీర్ వాంఖేడే వదిలిపెట్టబోడని అతడి సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. సుశాంత్ మృతి కేసులోను డ్రగ్స్‌కు సంబంధించి దర్యాప్తు పూర్తికాలేదు. ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే కరణ్ జోహర్ పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పార్టీలో ఎవరూ కూడా డ్రగ్స్‌ను తీసుకోలేదని కరణ్ జోహర్ చెప్పడం విశేషం. కానీ, ఆ  పార్టీలో పాల్గొన్న  బాలీవుడ్ సెలెబ్రిటీలపై ఎన్సీబీ నిఘా ఉంచింది. 


రియా చక్రవర్తి, అర్మాన్ కోహ్లి, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులకు ఒకదానికి మరొదానితో సంబంధం ఉందంటూ అధికారుల దర్యాప్తులో తేలింది. ఆర్యన్ ఖాన్ కేసు ఎన్సీబీకి సవాల్ గా మారింది. ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా అతడిని అరెస్టు చేసినట్టు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆరోపిస్తున్నారు. గతంలోను శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దీపికా పదుకొనేతో ఎన్సీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెలువెత్తాయి. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఆర్యన్ కేసులో బలమైన సాక్ష్యాలు సంపాదించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. 



Updated Date - 2021-10-21T22:27:32+05:30 IST