మరో ఘనత సాధించిన Jai Bhim సినిమా

ABN , First Publish Date - 2021-11-30T01:31:28+05:30 IST

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం జై భీమ్. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 2న విడుదలయిన ఈ చిత్రం అభిమానుల మన్ననలు పొందడంతో పాటు

మరో ఘనత సాధించిన Jai Bhim సినిమా

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం జై భీమ్. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 2న విడుదలయిన ఈ చిత్రం అభిమానుల మన్ననలు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఐఏమ్‌డీబీ‌లో అత్యధికంగా 9.6 రేటింగ్ సాధించి వరల్డ్ రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డును సృష్టించింది. 


అస్కార్ అనంతరం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు. ఉత్తమ విదేశీ చిత్రం కేటగీరిలో జై భీమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ అయింది. లాస్ ఏంజిలిస్‌లో 2022 జనవరి 9న ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్ సాధించడంతో అభిమానులు హీరో సూర్యను సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.


ఈ సినిమా పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది. చిత్రంలోని ఒక సీన్‌ మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉండటంతో ఆ సన్నివేశంపై ప్రేక్షకులల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నిర్మాతలు ఆ సన్నివేశాన్ని మార్చారు. వన్నియార్ కమ్యూనిటీని హీరో సూర్య కించపరిచాడని పీఎంకే నేతలు ఆరోపించారు.  వన్నియార్ సంఘం రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. సూర్య, జ్యోతిక, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నవంబర్ 15న ఆ సంఘం లీగల్ నోటీసులు పంపిచింది. దీంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించిన టీజే.జ్ఞానవేల్  క్షమాపణలు చెప్పారు.

Updated Date - 2021-11-30T01:31:28+05:30 IST