Allu Arjun : ‘పుష్ఫ 2’ కు ముందు వేరే ప్రాజెక్ట్?

ABN , First Publish Date - 2022-07-01T14:43:53+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులందరి దృష్టి ఇప్పడు ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంపైనే ఉంది. మొదటి భాగానికి వచ్చిన భారీ క్రేజ్‌తో.. రెండో భాగాన్ని మరింత పకడ్బందీగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు సుకుమార్ (Sukumar).

Allu Arjun : ‘పుష్ఫ 2’ కు ముందు వేరే ప్రాజెక్ట్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులందరి దృష్టి ఇప్పడు ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంపైనే ఉంది. మొదటి భాగానికి వచ్చిన భారీ క్రేజ్‌తో.. రెండో భాగాన్ని మరింత పకడ్బందీగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా ఈ భాగంలోనూ కంటిన్యూ అవుతుండగా.. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్  ధనుంజయ, జగదీష్ పాత్రలు రెండో భాగంలో మరింత కీలకం కాబోతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రైటర్స్ బృందం స్ర్కిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ను లాక్ చేసే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ అదే మేకోవర్ ను కంటిన్యూ చేస్తూ.. ‘పుష్ప 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో ఉన్నాడు. 


నిజానికి ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా కాస్తంత ఆలస్యంగా పట్టాలెక్కబోతోంది. అయితే ఇంకొన్ని సమస్యలు ఎదురవడంతో షూటింగ్‌కు మరింత లేటు అవుతుందని సమాచారం. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ వేరే ప్రాజెక్ట్ మొదలు పెడతాడని టాక్స్ వినిపిస్తున్నాయి.ఇటీవల అల్లు అర్జున్ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ..  తాను ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రంపైనే ప్రధాన ఫోకస్ పెడతున్నట్టు చెప్పాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో మరింత జాగ్రత్తగా అడుగులేయబోతున్నట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా లేటయ్యేలా కనిపిస్తూండడంతో బన్నీ (Bunny) వేరే ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆ వేరే ప్రాజెక్ట్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. 


నిజానికి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం తర్వాత బోయపాటి (Bopapati) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు బోయపాటి రామ్ పోతినేని (Ram Pothineni) తో సినిమా తీసే హడావిడిలో ఉన్నారు. ఇంకా కొరటాల శివ (Koratala Shiva), హరీశ్ శంకర్ (Harish Shankar) లాంటి దర్శకుల పేర్లూ వినిపించాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ తమ తమ ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్నారు. ఒక వేళ  పుష్ప చిత్రానికి ముందు అనౌన్స్ మెంట్ వచ్చి ఆగిపోయిన వేణు శ్రీరామ్ (Venu Sriram) ‘ఐకాన్’ (Icon) చిత్రాన్ని తిరిగి మొదలు మొదలు పెడతారేమో తెలియదు కానీ.. ఈ గ్యాప్ లో బన్నీ ఏ సినిమా చేస్తాడనే విషయంలో ఆసక్తి మొదలైంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే .. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-07-01T14:43:53+05:30 IST