విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తోన్న మూవీ 'విక్రమ్'. ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ 'విక్రమ్' కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. గిరీష్ గంగాధరన్ 'నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి', 'గుప్పీ', 'అంగమలీ డైరీస్', 'జల్లికట్టు' వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించారు. ప్రముఖుల ప్రశంసలతో పాటు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గాను జాతీయ అవార్డును దక్కించుకున్నారు.
ఇదే క్రమంలో గిరీష్.. తలపతి విజయ్, ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ’సర్కార్’ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఇప్పటికే నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ అన్బరివ్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. కాగా ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి, నరైన్ విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.