Kollywood లో మరో కామెడీ హారర్ థ్రిల్లర్

Twitter IconWatsapp IconFacebook Icon
Kollywood లో మరో కామెడీ హారర్ థ్రిల్లర్

‘యామిరుక్క బయమే’ (Yamirukka bayame) వంటి చిత్రంతో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు డీకే (DK). ఇపుడు ‘కాట్టేరి’ (Kaatteri) పేరుతో కామెడీ, హర్రర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ (Vaibhav) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడం విశేషం.  స్టూడియో గ్రీన్‌ (Studio Green) బ్యానరులో కేఈ ఙ్ఞానవేల్‌ రాజా (KE gnanael Raja), అభి అండ్‌ అభి పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా విశేషాలను చిత్రం బృందం విలేకరులకు వెల్లడించింది. దర్శకుడు డీకే మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా కాలం క్రితం ప్రారంభించాం. ఇంతకాలానికి పూర్తిచేశాం. శ్రీలంక అడవుల్లో కఠినమైన వాతావరణంలో షూటింగ్‌ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌ ఎంతగానో సహకరించారు. నిర్మాతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ తెలిపారు. 


హీరోయిన్‌ వరలక్ష్మి (Varalakshmi) మాట్లాడుతూ.. ‘తనకు చిన్న వయసులో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు. ఎట్టకేలకు పూర్తిచేసి విడుదల చేస్తున్నారు. డీకే దర్శకత్వంతో పాటు స్టూడియో గ్రీన్‌ బ్యానరులో నటించాలన్న కోరిక నెరవేరింది’ అన్నారు. హీరో వైభవ్‌  మాట్లాడుతూ.. ‘స్టూడియో గ్రీన్‌ బ్యానరులో నిర్మించాలన్న కల ఫలించింది. కానీ, ఇంత జాప్యం జరుగుతుందని ఊహించలేదు. ఆగస్టు 5న విడుదల చేస్తున్నాం. మీడియా మిత్రులు సపోర్ట్‌ చేయాలి’ అని కోరారు. అలాగే, నిర్మాత కేఈ ఙ్ఞానవేల్‌ రాజా, హీరోయిన్‌ ఆత్మిక, సంగీత దర్శకుడు ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు. వైభవ్‌, వరలక్ష్మి, ఆత్మికలతోపాటు మనాలీ, పొన్నాంబలం, రవి మారియ, మైమ్‌ గోపి, జాన్‌ విజయ్‌, లొల్లు సభా మనోహర్‌ తదితరులు నటించారు. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Mailicon [email protected]dhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.