హాట్‌ యాంకర్‌ సినిమాకు అనూప్‌ మ్యూజిక్‌

ABN , First Publish Date - 2022-01-17T01:04:33+05:30 IST

బుల్లితెర హాట్‌ యాంకర్‌గా బిజీగా ఉన్న అనసూయ తన అభిరుచికి తగ్గ చిత్రాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న ఓ చిత్రంలో ఎయిర్‌ హోస్టెస్‌గా నటిస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్‌ సంగీతం అందిస్తున్నారు.

హాట్‌ యాంకర్‌ సినిమాకు అనూప్‌ మ్యూజిక్‌

బుల్లితెర హాట్‌ యాంకర్‌గా బిజీగా ఉన్న అనసూయ తన అభిరుచికి తగ్గ చిత్రాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న ఓ చిత్రంలో ఎయిర్‌ హోస్టెస్‌గా నటిస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. హెబా పటేల్‌ మరో నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్వీ సినిమాస్‌ పతాకంపై ఆర్వీ రెడ్డి, శేషు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింఇ. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తారు. 


Updated Date - 2022-01-17T01:04:33+05:30 IST