నిర్మాతగా అన్నయ్య హ్యాపీ
ABN , First Publish Date - 2021-11-14T07:51:06+05:30 IST
‘ప్రేక్షకులు ‘పుష్పక విమానం’ చిత్రాన్ని ఫ్లైయింగ్ హిట్ చేశారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాతగా అన్నయ్య విజయ్ హ్యాపీగా ఉన్నాడు. నటీనటులందరూ బాగా చేశారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు...

‘ప్రేక్షకులు ‘పుష్పక విమానం’ చిత్రాన్ని ఫ్లైయింగ్ హిట్ చేశారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాతగా అన్నయ్య విజయ్ హ్యాపీగా ఉన్నాడు. నటీనటులందరూ బాగా చేశారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు’’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. దామోదర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఆనంద్ మాట్లాడుతూ ‘‘రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. హాస్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొత్తగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. సందర్భానుసారం వచ్చే హాస్య సన్నివేశాలకు బాగా నవ్వుతున్నారు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. థియేటర్లలో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. న రేష్, సునీల్ క్యారెక్టర్ల ద్వారా మంచి కామెడీ జనరేట్ అయ్యింది. మౌత్‌టాక్‌తో సినిమాకు మంచి ప్రచారం వస్తోంది’’ అన్నారు. హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ ‘‘నా పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని టెన్షన్ పడ్డాను. కానీ వారికి మీనాక్షి పాత్ర చాలా నచ్చిందని చెబుతుండడం సంతోషంగా ఉంది. వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం ఇది’’ అని చెప్పారు. శాన్వీ మేఘన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ హిట్ దొరికింది’’ అన్నారు.