‘పెద్దన్న’ గా రజినీకాంత్ ‘అన్నాత్త’

ABN , First Publish Date - 2021-10-15T19:14:02+05:30 IST

సూపర్ స్టార్ రజినీకాంత్ , నయనతార జంటగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘అన్నాత్త’. ‘దర్బార్’ తర్వాత రజినీ నటించిన సినిమా కావడంతో ‘అన్నాత్త’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక గ్రామాన్ని, కుటుంబాన్నిఒక అన్న ఎలా కాపాడుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రజినీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

‘పెద్దన్న’ గా రజినీకాంత్ ‘అన్నాత్త’

సూపర్ స్టార్ రజినీకాంత్ , నయనతార జంటగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ మూవీ ‘అన్నాత్త’. ‘దర్బార్’ తర్వాత రజినీ నటించిన సినిమా కావడంతో ‘అన్నాత్త’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక గ్రామాన్ని, కుటుంబాన్నిఒక  అన్న ఎలా కాపాడుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రజినీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా.. ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా  నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. 


ఇక ‘అన్నాత్త’ సినిమాని తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్బంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. రజినీకాంత్ పంచెకట్టులో హెల్మెట్ పెట్టుకొని, కత్తి పట్టుకొని బుల్లెట్ మీద రివీలైన లుక్ ను విడుదల చేశారు. రజినీకాంత్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అవుతుందని చెబుతున్నారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాకోసం యస్పీ బాలు పాడిన ఆఖరి పాట హైలైట్ గా నిలిచిపోయింది. ‘పెద్దన్న’ గా రజినీకాంత్ ఏ రేంజ్ లో విజృంభిస్తారో చూడాలి. 



Updated Date - 2021-10-15T19:14:02+05:30 IST