అన్నపూర్ణ స్టూడియోస్ చేతుల్లోకి కార్తీ ‘Sardar’

ABN , First Publish Date - 2022-06-28T00:42:35+05:30 IST

హీరో కార్తీ (Karthi), ‘అభిమన్యుడు’ ఫేమ్ పిఎస్ మిత్రన్‌ (PS Mithran) కాంబినేషన్‌లో.. ప్రిన్స్ పిక్చర్స్ (Prince Pictures) బ్యానర్‌‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ (S Lakshman Kumar) నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ (Sardar). ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ

అన్నపూర్ణ స్టూడియోస్ చేతుల్లోకి కార్తీ ‘Sardar’

హీరో కార్తీ (Karthi), ‘అభిమన్యుడు’ ఫేమ్ పిఎస్ మిత్రన్‌ (PS Mithran) కాంబినేషన్‌లో.. ప్రిన్స్ పిక్చర్స్ (Prince Pictures) బ్యానర్‌‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ (S Lakshman Kumar) నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ (Sardar). ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సొంతం చేసుంది. కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో దిట్టగా పేరున్న మిత్రన్ నుండి వస్తున్న ‘సర్దార్‌’‌ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు భారీ పోటీని ఎదుర్కొని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు హక్కులను సొంతం చేసుకుంది. 2022 దీపావళికి ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తుండటంతో సహజంగానే ‘సర్దార్’పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కాగా, కార్తీ సినిమాను తెలుగు విడుదల చేస్తున్నందుకు కింగ్ నాగార్జున, తన సినిమాను నాగార్జున తెలుగులో విడుదల చేస్తున్నందుకు హీరో కార్తీ.. ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-06-28T00:42:35+05:30 IST