డైరెక్ట్‌గా ఓటీటీలో విజయ్ సేతుపతి-తాప్సీల చిత్రం.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2021-08-26T23:32:56+05:30 IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్‌పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా ‘అనబెల్ అండ్ సేతుపతి’. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. సెప్టెంబర్..

డైరెక్ట్‌గా ఓటీటీలో విజయ్ సేతుపతి-తాప్సీల చిత్రం.. ఎప్పుడంటే?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్‌పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా ‘అనబెల్ అండ్ సేతుపతి’. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో డైరెక్ట్‌గా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా తాజాగా రిలీజ్ పోస్టర్‌ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి, తాప్సీ ఫేస్ బాగా హైలెట్ చేశారు. వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ అవుతోంది. పోస్టర్ ఆన్ రివర్స్‌లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్‌ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో ‘అనబెల్ అండ్ సేతుపతి’కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.



Updated Date - 2021-08-26T23:32:56+05:30 IST